గిరిజన గురుకుల పాఠశాలలో తహశీల్దార్ తనిఖీ

దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తహశీల్దార్ రామ్ నరేష్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులను స్వయంగా పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు .భోజన నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని , నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.

Leave a Reply