Saturday, June 29, 2024

TG ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లు ఏర్పాటుకు శ్రీకారం

హైదరాబాద్ – రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు.పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులతో నేడు సమీక్షించారు. ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు.

దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement