Thursday, June 27, 2024

HYD: యోగా తనువును, మనస్సును ఏకం చేసే సాధనం… ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : యోగ అనేది ఒక వ్యాయామం కాదు అది తనువును, మనస్సును ఏకంచేసే సాధనమ‌ని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వహక వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాగృతి అభ్యుదయ సంఘం శ్రీ షిరిడీ సాయి అష్టాంగ యోగ సంయుక్త, ఈస్మైల్, భవన శ్రీనివాస్ ల‌ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ శ్రీ కన్వెన్షన్ లో జరిగిన యోగా డే సన్మాన వేడుకల కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ అడ్వైజరీ బోర్డ్ సెంట్రల్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా తో కలిసి హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ… శారీరక, మానసిక సామర్ధ్యాలను పెంచి మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఏకైక మార్గం యోగా అన్నారు. సనాతన భారతీయ ధర్మం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వరం యోగా ఆధునిక జీవన విధానంలో మారిన ఆహార అలవాట్లు, ఒత్తిడులతో ఎదురవుతున్న పలు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి.. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే సాధనమ‌ని ఆయన అన్నారు. అనంతరం 25మంది యోగ గురువులకు సన్మానం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యోగ గురువులు వాని శ్రీ సాంబశివ రావు, వందన వెంకటేశ్వర్లు, ఎలిజబెత్ ప్రదీప్ రావు అరుణ, గంజి నాగేశ్వర్ రావు, సినీ నటుడు పసునూరి శ్రీనివాసులు, ప్రోపెటేర్ లక్ష్మి కన్వేశన్ కర్మన్ ఘాట్, ఐవీఎఫ్‌ కోశాధికారి నారాయణ, ఐవీఎఫ్‌ మొదటి మహిళ ఉప్పల స్వప్న, చెందా భాగ్యలక్ష్మి, మంజుల, జగతి, మనిమాల యూత్ అధ్యక్షుడు కట్ట రవి కుమార్, యూత్ కోశాధికారి నరేష్ గుప్తా, చింతల రజినీకాంత్, ప్రవీణ్ శ్రీధర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement