Saturday, June 29, 2024

Breaking | హైదరాబాద్ లో ప‌లు చోట్ల వర్షం …

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, అబిడ్స్, ఓయూ, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. రెండు గంటల్లో కూకట్‌పల్లి, సెరిలింగంపల్లి, కుతుబుల్లాపూర్, అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉంటే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. మరోవైపు వర్షాలు లేని ప్రాంతాల్లో ఉక్కుపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement