Friday, June 28, 2024

Balanagar ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తులు … ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీతో అర్ ఐ గుట్టు రట్టు

బాలనగర్ జూన్ 23 ప్రభా న్యూస్ బాలనగర్ మండల కేంద్రంలో గల ఎమ్మార్వో కార్యాలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్ ఐ వెంకట్ రెడ్డి తన కార్యాలయంలో పనులు చేస్తుండడంతో జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అను రుద్దు రెడ్డి అకస్మానిక తనిఖీ నిర్వహించడం జరిగింది .

ఈ వెంకటరెడ్డి పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆదివారం రోజు ఎలా పని చేస్తారని ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని అందులో తలుపులు మూసుకొని పనులు ఎలా చేస్తారని ఆర్ ఐ ని ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement