Friday, May 17, 2024

Keerthy Suresh : గ్లామ‌ర్ పాత్ర‌ల‌కూ రెడీ …

ప్ర‌స్తుతం కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. అందులోనూ త‌మిళ్ లో చాలా బిజీగా ఉంది. ఈనేప‌థ్యంలోనే బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది. బేబిజాన్ అనే ఓసినిమా చేస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా సైన్ చేసింది. గ్లామ‌ర్ విష‌యంలో కూడా ఎలాంటి కండీష‌న్లు పెట్టుకోకుండా పనిచేస్తుంది.

- Advertisement -

గ‌తంలా ఉంటే ప‌నిజ‌ర‌గ‌ద‌ని భావించిన అమ్మ‌డిప్పుడు అప్డేట్ అయి పని చేస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలోపెళ్లి వార్త రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో? తెలియాలి. పెళ్లైన భామ‌లు న‌టిగా కొన‌సాగుతున్నారు కాబ‌ట్టి అదేమి కీర్తికి అడ్డంకి కాదు. పైగ కీర్తి త‌ల్లి న‌టి మేన‌క అన‌న సంగ‌తి తెలిసిందే. మేనక కూడా వివాహం త‌ర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో న‌టించారు. మూడేళ్ల క్రితం వ‌ర‌కూ కూడా ఆమె యాక్టివ్ గా నే ఉన్నారు.

కాబ‌ట్టి త‌ల్లివైపు నుంచి పూర్తి మ‌ద్ద‌తు కీర్తికి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో బేబి జాన్ లో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. అక్క అనే హిందీ వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇందులో అమ్మ‌డు ఏకంగా ప్రియ‌మ‌ణితోనే పోటీ ప‌డి న‌టిస్తోంది. ఆమె తో గ్లామ‌ర్ ప‌రంగా పోటీ ప‌డుతుంది. అందుకు అన్ని ర‌కాలుగా సిద్ద‌మై వెబ్ సిరీస్ కి క‌మిట్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement