Sunday, June 30, 2024

TG | హైదరాబాద్ మెట్రో ఆదాయం డబుల్….

ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో హైదరాబాద్ మెట్రో ఆదాయం భారీగా పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైలు కంపెనీ ఆదాయాన్ని అధికారులు ఇటీవల వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1407.81 కోట్ల ఆదాయం వచ్చిందని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. అంటే గతేడాదితో పోలిస్తే ఆదాయం రెండింతలు పెరిగి 105 శాతం ఆదాయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

టిక్కెట్ల విక్రయం ద్వారా కంపెనీ రూ.611.48 కోట్లు ఆర్జించింది. రవాణా ఆధారిత అభివృద్ధి (TOD) ద్వారా రూ.796.33 కోట్ల ఆదాయం వచ్చింది. మాల్స్, ఆఫీసు అద్దెలు, టెలికాం టవర్లు, అడ్వటైజ్‌మెంట్ల ద్వారా 284.60 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లీజుకు తీసుకున్న భూమిని మెట్రోకు స్లంప్ సేల్ రూపంలో బ్రూక్‌ఫీల్డ్ కార్పొరేషన్, రహేజా గ్రూప్‌లకు బదిలీ చేయడం ద్వారా మొదటి దశలో రూ.511.73 కోట్ల ఆదాయం వచ్చింది.

అయినా నష్టాల్లోనే..

అయితే, గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరిగినా.. ఓవరాల్ గా మెట్రో సంస్థ నష్టాల్లోనే ఉంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ.5979.36 కోట్ల నష్టం వాటిల్లిందని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement