Sunday, July 7, 2024

Andhra Pradesh … ఆపరేషన్ నో ఎవిడెన్స్! ప‌లు శాఖల‌లోని ఫైల్స్ ద‌గ్ధం .. రంగంలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్

సీఐడీ శాఖ‌లో మొద‌లైన ప‌ర్వం
తొంద‌ర‌ప‌డి ఫైల్స్ అన్నీ కాల్చివేత
ఇప్పుడు మైనింగ్ శాఖ‌లోని ఫైల్స్ దహనం
తెరమీదకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి..
మ‌రో ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ
ద‌స్త్రాలు తరలిచిన కారుపై ప్రభుత్వ స్టిక్కర్
అధికారుల‌కు దొరికిన డ్రైవర్‌..
అత‌ని వాంగ్మూలంలో పెద్దోళ్ల పేర్లు
ఈ మిస్టరీ వెనుక మరో కీలక నేతపై ప‌లు అనుమానాలు
ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న గ‌త ప్ర‌భుత్వ‌పు అక్ర‌మాలు
రంగంలోకి దిగిన ప‌వ‌న్ కల్యాణ్..
కాల్చివేసిన సంఘ‌ట‌న వివ‌రాలు అందించాల‌ని ఆదేశం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త‌ ప్రభుత్వం పాలన ప్రారంభమైన 22 రోజుల్లోనే… గత ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వ‌స్తున్నాయి. అస‌లు క‌థ మొద‌లు కాక‌ముందే ఎవిడెన్స్‌ని నామ‌రూపాల్లేకుండా నాశ‌నం చేసే ప‌నిలో అక్ర‌మార్కులు ముందుచూపుతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గత పాలనలో యథేశ్చగా జరిగిన అంశాలన్నీ అక్రమాలేన‌ని ప్రభుత్వం పసిగట్టక మునుపే … అక్రమాచార్యులు తమ నిజాలను కప్పిపుచ్చే యత్నాల్లో నిమగ్నమమ్యారు. ₹2.70లక్షల కోట్లతో సంక్షేమం పేరిట అయిదేళ్లపాటు నవరత్నాలను వెదజల్లాం.. మళ్లీ మనదే అదికారం అని అప్పటి ప్రభుత్వంలో మేటి నాయకులు భావించారు. కానీ, ఫలితాలు తారుమారు కావడంతో తలపట్టుకుని ఏం చేయాలో తోచని స్థితికి చేరుకున్నారు. అయితే.. బ్యూరోక్రాట్ల గుండె దడదడ కొట్టుకోవటం ప్రారంభించిన తరుణంలో… తమ వీపుపై మచ్చను తప్పించుకునేందుకు రహస్యాల మాయం కత్రువు ప్రారంభమైంది. తమ అవినీతిని కప్పి పుచ్చు కునేందుకు ‘ఆపరేషన్​ ఎవిడెన్స్’ ను స్టార్ట్​ చేశారా?.. ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి ఆదారం, ఆనవాళ్లు దొరక్కకుండా చేస్తున్నా రా? అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఇటీవల సీఐడీ, నేడు ఏపీ ఖనిజాభివృద్ధి, పొల్యూషన్ నియంత్రణ మండలికి పేపర్ల కాల్చివేత ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి.

- Advertisement -

కలుగుల్లోని నిజం వెలుగులోకి..

ఇక ఏ శాఖ బల్లగింద చేతి వాటం బయట పడుతుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పేదోళ్ల బియ్యం పరాయి దేశాలకు అక్రమ రవాణా కాకినాడ రేవులో గుప్పుమంది. మరో వైపు చిత్తూరు జిల్లా నుంచి నేపాల్కుదొంగదారిలో మళ్లిన ఎర్రచందనం దుంగల కథ వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలో.. తాజాగా మైనింగ్శాఖఉలిక్కి పడింది. ఆయా శాఖల మంత్రులు ఇలా బాధ్యతలు స్వీకరించారో? లేదో? అలా అధికారుల గుండెల్లో రైళ్ల వేగం పెరిగింది. తాజా గా బుధవారం రాత్రికొంతమంది వ్యక్తులు ఇన్నోవా కారులో కరకట్టపైకి వచ్చారు. కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలో బస్తాల్లోని దస్త్రాలను తగలపెట్టారు. అటువైపు వెళ్తున్న స్థానికులు ఈ దహనకాండను గమనించారు. ఇదేంటని ప్రశ్నించేలోపు ఆ కారులోని యనమలకుదురు వైపు పలాయనం చిత్తగించగా.. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాలుష్య మండలి మాజీ ఛైర్మన్ సమీర్‌శర్మ ఫోటోలు కనిపించాయి.

ఈ సమాచారం టీడీపీ నేతలకు చేరింది. పారిపోతున్న కారును యనమలకుదురులో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని కారులోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వచ్చి కాలిపోయిన ఫైల్స్‌ను పరిశీలించారు. ఫైల్స్‌పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ ఫోటోలు ఉన్నాయి. సమీర్‌శర్మ సూచనతో ఫైల్స్ తీసుకొచ్చి తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్‌ నాగరాజు చెప్పారు. కానీ సమీర్శర్మప్రస్తుతం విధుల్లో లేరు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఫైల్స్, హార్డ్ డిస్క్‌ దహనం వ్యవహారంలో మిస్టరీగా మారింది.

ఆపరేషన్ ఎవిడెన్స్ .. మూలాలెన్నో..?

ఎన్నికల ముందు ఉభయ కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా జోగి రమేష్వ్యవహరించారు. ఆయన అనుచరవర్గం మొత్తం మట్టి వ్యాపారంలోనే నిమగ్నమైంది. ఆయన పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు స్వీకరించక ముందే తోట్లవల్లూరు, కంకిపాడు మండల్లాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. నిత్యం వందల కొద్దీ ట్రిప్పర్లతో ఇసుకను అక్రమంగా రవాణ చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్రాజబాబు క్వారీల్లోకి వెళ్లారేగానీ… ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఇసుక మాఫియాకు బ్రేక్పడింది.

ఈస్థితిలోనే మైనింగ్శాఖఫైల్స్తగలబెట్టేపరిస్థితిఏర్పడింది. ప్రస్తుతం డ్రైవరు నాగరాజు తీసుకువచ్చిన కారు నెంబర్తో … ఎవరుప్రోద్బలం చేశారో? సంగతి తేలుతుంది. అయితే ఆ అధికారులు మాత్రం కాగితాల దహనానికి తమకు సంబంధం లేదని వాదించటం సర్వసాధారణమే. ఇప్పటికే కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా తట్టాబుట్టా సర్దేసింది. ఇక పసుపు తమ్ముళ్లు తమ జేసీబీలు, ప్రొక్లెయిన్లకు గ్రీజు పట్టించారు. కొత్త ఇసుక పాలసీ విడుదల కాగానే.. తమ వ్యాపారానికి భూమి పూజలు చేయటానికి సిద్ధపడుతున్నారు. మరి కొందరు అప్పుడే ముడా భూముల్లో మట్టిని తవ్వేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మట్టి వ్యాపారాన్ని పసుపు సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇలాంటి స్థితిలో మైనింగ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తన ఇలాఖాలో మట్టి మాఫియాకు కళ్లెం వేస్తారా? లేక అనధికార అధికారాన్ని అప్పగిస్తారా? అని జనం ఎదురు చూస్తున్నారు.

పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని కోరారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement