Friday, March 29, 2024

అన్నమయ్య సంకీర్తనలు

సామాన్యమా పూర్వ సంగ్రహంబగు

సామాన్యమా పూర్వ సంగ్రహంబగుఫలము
నేమమున పెనగొనియె నేడు నీవనక || సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ||

జగతి ప్రాణులకెల్ల సంసార బంధంబు
తగుల బంధించు దురితంపు కర్మమున
మగుడ మారుకు మారు మగువ నీవురముపై
తెగికట్టి రెవ్వరో దేవుండ వనక || సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ||

పనిలేక జీవులను భవసాగరంబులో
మునుగ లేవగజేయు మోహదోషమున
పనిబూని జలధిలో పండబెట్టిరినిన్ను
వెనకెవ్వరో మొదటి వేలుపనక || సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ||

వుండనియ్యక జీవనోపాయమున మమ్ము
కొండలను గొబల తతిగొని తిప్పు ఫలము
కొండలను నెలకొన్న కోనేటిపతి వనగ-
వుండవలసెను నీకు ఓపలేననక || సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement