Friday, April 19, 2024

పవిత్రమైన ఆలోచనలు

నీ ఆలోచనలే నీ వ్యక్తిత్వము.

ప్రేమ, పవిత్రత, శాంతి, విజ్ఞానము – వీటి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో అంతగా నువ్వు అలా అవుతావు.
బలహీనత నీలో కానీ ఇతరులలో కానీ ఎక్కువ మోతాదులో ఉంటే నకారాత్మక ఆలోచనలను ఆహ్వానిస్తుంది. అవి నిన్ను నాశనం చేస్తాయి.

నీ ధ్యాసను మార్చుకోవడం ఎలాగో నేర్చుకో.
అందుకు బదులుగా ఇలా ఆలోచించు :
నేను పవిత్రం గా లేకపోయినా నాకు పవిత్రత కావాలి. భగవంతుడు నన్ను నా లక్ష్యానికి చేరుస్తున్నారు, కనుక నేను తప్పకుండా పవి త్రంగా అవుతాను.

గృహ నిర్మాణంలో ప్రతి ఇటుక లెక్కింపబడుతుంది.
చరిత్ర నిర్మాణంలో ప్రతి ఆలోచన లెక్కింపబడుతుంది.
ముందుగా , పవిత్రత గురించి ఆలోచించనంత వరకు నేను పవిత్రంగా అవ్వను.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement